Sunday, November 21, 2010

గెలాక్సీకి బయట కొత్త గ్రహమట...!


గెలాక్సీకి బయట ఓ గ్రహం ఉందట. దాన్ని అంతరిక్ష పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కనిపెట్టారట. ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు ఓ ఐదొందల దాకా గ్రహాలను గుర్తించారట గానీ.. ఇలా గెలాక్సీకి దూరంగా ఉన్న గ్రహం గతంలో ఎప్పుడూ గమనించలేదట.
తాజాగా కనిపెట్టిన గ్రహం భూగ్రహం కన్నా 400 రెట్లు భారీగా ఉందట. దీనికి HIP 13044b అని పేరు పెట్టారు. హైడ్రోజన్‌, హీలియంతో కూడిన ఈ గ్రహం.. హెల్మీ స్ట్రీమ్‌గా పిలుచుకునే సౌర వ్యవస్థకు చెందిందట. ఇది భూమికి సుమారు రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట.

ఆరు నుంచి తొమ్మిది బిలియన్ సంవత్సరాల క్రితం.. ఈ హెల్మి స్ట్రీమ్‌ పాలపుంతలో కలిసిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇది 2.2 మీటర్‌-డయామీటర్‌ టెలిస్కోప్‌కి అస్పష్టంగా కనిపిస్తోందట. చూడాలి ఈ గ్రహానికి సంబంధించిన ఎన్నెన్ని కొత్త విషయాలు వెలుగుచూస్తాయో..!

Tuesday, November 9, 2010

మనసులో మాట..

మిత్రులారా..

మాటామంతి ద్వారా నా మనసులో ఎప్పటికప్పుడు అలముకున్న భావాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
త్వరలోనే మరో పోస్టుతో కలుస్తా..

ఉంటానే..

విజయ్‌